టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ సమితి : జేపీ నడ్డా

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ సమితి : జేపీ నడ్డా
అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ సర్కార్ : జేపీ నడ్డా
Mahabubnagar: డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ కు అభివృద్దిలో రెట్టింపు ప్రయోజనం కలుగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. టీఆర్ఎస్ ను తెలంగాణ రజాకార్ సమితి గా అభివర్ణించారు. పాలమూరులో జరిగిన ప్రజాసంగ్రామసభలో పాల్గొన్న నడ్డా కేంద్రం ఇస్తున్న నిధులతో కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టి తెలంగాణ లో పథకాలకు పేర్లు పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేసారు.
తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. పాలమూరులో జరిగిన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దుబ్బాకలో ధమాకా, హుజూరాబాద్ లో ఎదురుదెబ్బలు తెలంగాణ లో టీఆర్ఎస్ కు గుణపాఠం లాంటివన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎం లా మారిందని.. అత్యంత అవినీతి సర్కారు కేసీఆర్ సర్కార్ అని విమర్శించారు. టీఆర్ఎస్ తెలంగాణ రజాకార్ సమితి గా అభివర్ణించిన నడ్డా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ కు అభివృద్దిలో రెట్టింపు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి తెలంగాణలో కాపీ కొడుతున్నారని జేపీ నడ్డా విమర్శించారు.
అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 22 వ రోజు పాలమూరు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఎం.వీ.ఎస్ కాలేజీ గ్రౌండ్ లో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగించారు. పాలమూరులో వలసలు లేవని అంటున్న సీఎం కు వలసలున్నాయని నిరూపించేందుకు సిద్దంగా ఉన్నామని, తన సవాల్ ను స్వీకరించాలన్నారు. తన మాట నిజమైతే కేసీఆర్, అతని కుటుంబం తెలంగాణ ను వదిలి వెళ్లిపోవాలన్నారు. వలసలు లేవని నిరూపిస్తే తను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ సవాల్ విసిరారు.
పాలమూరులో జరిగిన బహిరంగసభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావు, ఎంపీలు సోయం బాపురావు, అర్వింద్ , మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. సభ అనంతరం వేదికపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తోపాటు కార్యకర్తలు స్టెప్పు లేసారు.
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
సీఎం పోస్టు కోసం బీజేపీతో బంధాన్ని తెంచుకున్న శివసేన
30 Jun 2022 1:18 AM GMTజులై 1న కొలువు దీరనున్న బీజేపీ, ఏక్నాథ్ షిండే సర్కార్
30 Jun 2022 1:00 AM GMTApples: పరగడుపున యాపిల్ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!
30 Jun 2022 12:30 AM GMTBihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMT