సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విచిత్రమైన ధోరణితో జోకర్‌లా ప్రవర్తిస్తున్నారు : బండి సంజయ్

సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విచిత్రమైన ధోరణితో జోకర్‌లా ప్రవర్తిస్తున్నారు : బండి సంజయ్
x
Highlights

దేశం కోసం పోరాడి ప్రాణాలను సైతం కోల్పోయి అమరుడైన భారతమాత ముద్దు బిడ్డలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు

దేశం కోసం పోరాడి ప్రాణాలను సైతం కోల్పోయి అమరుడైన భారతమాత ముద్దు బిడ్డలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ తన చేతకాని తనాన్ని కేంద్రం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ శ్రేణులు కేసీఆర్ ను కరోనా విషయంలో మొదటి నుంచి హెచ్చరిస్తున్నారని, అయినా ఆయన పెడచెవిన పెట్టారని అన్నారు. మొదటి నుంచి కరోనా టెస్టులు పెంచాలని కోరుతున్నా వినకుండా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారు. గత కొద్ది రోజుల నుంచి కరోనా వైరస్ రాష్ట్రాన్ని అతలా కుతలం చేస్తుందని ఆయన అన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విచిత్రమైన ధోరణితో జోకర్‌లా వ్యవహరిస్తున్నారు. కరోనా విషయంలో సీఎం కేసీఆర్ తీరు నిద్రలో నుంచి లేచి స్టేట్మెంట్‌లు ఇస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేసారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 44 వేల టెస్టులు మాత్రమే చేసారని ఆయన తెలిపారు. ఇప్పుడేమో తాజాగా 50వేల టెస్టులు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేసారు. కానీ వాటిని ఎలా చేస్తారో మాత్రం చెప్పరన్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆస్పత్రులను సందర్శిస్తుంటే సీఎం కేసీఆర్‌ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడమో లేదా ఆయుష్మాన్‌ భారత్‌లో చేర్చి పేద ప్రజలను కాపాడాలని ఆయన సూచించారు. గచ్చిబౌలిలోని 1,500 పడకల టిమ్స్‌ హాస్పటల్‌ ఏమైందని ఆయన ప్రశ్నించారు. చాలా మంది కరోనా బాధితులకు సరైన చికిత్సలు అందించకుండానే కరోనా పాజిటివ్‌ వచ్చిన పేషంట్‌లను ఎందుకు హోం క్వారంటైన్‌కు పంపుతున్నారని అడిగారు.ఇక ప్రతి ఏడాది నిర్వహించే హరితహారం కింద కోటి మొక్కలు నాటుతామన్నారని, కానీ ఈ రోజు ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకున్న తెలంగాణ ప్రజలను వెంటనే తమ స్వస్థలాలకు రప్పించాలన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories