Raja Singh: నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి

BJP MLA Raja Singh said that he was Receiving Threatening Calls
x

Raja Singh: నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి

Highlights

Raja Singh: త్వరలోనే యోగి ఆదిత్యానాథ్‌ నా నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు

Raja Singh: తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ త్వరలో తన నియోజకవర్గంలో ప్రచారం నిమిత్తం రానున్నారని, ఈ నేపథ్యంలో ఇద్దరిని కలిపి చంపేస్తమంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందన్న రాజాసింగ్.. ఫోన్ చేసి తనను చంపుతామని, నరుకుతామని బెదిరిస్తున్నారన్నారు. ఇంతకుముందు కూడా ఇలాగే తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు. ఈ విషయాన్ని తాను పోలీసుల దృష్టికి తీసుకు వెళ్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories