logo
తెలంగాణ

Medak News: రామాయంపేట సంతోష్‌ కుటుంబానికి బీజేపీ నేతల పరామర్శ

BJP Leaders Visit Ramayampet Santoshs Family
X

Medak News: రామాయంపేట సంతోష్‌ కుటుంబానికి బీజేపీ నేతల పరామర్శ

Highlights

Medak News: సంతోష్ కుటుంబానికి అండగా ఉంటామని ఈటల, రఘునందన్‌ హామీ

Medak News: రామాయంపేట సంతోష్ సూసైడ్ కేసులో నిందితులను తక్షణం అరెస్ట్ చేయకుంటే సీబీఐ విచారణ కోరుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. సంతోష్ కుటాంబాన్ని పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వం హత్యా రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్న అధికార పార్టీ పీడీ యాక్ట్‌ కేసులతో చిత్రహింసలు పెడుతోందని బీజేపీ నాయకులు విమర్శించారు.

డీజీపీ, పోలీస్ శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గులాంగిరీ చేస్తున్నాయని కమలం పార్టీ నేతలు మండిపడ్డారు. సంతోష్‌ కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ కేసులో ప్రమేయమున్న నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు రామాయంపేటలో బంద్ నిర్వహించారు.

Web TitleBJP Leaders Visit Ramayampet Santosh's Family
Next Story