Top
logo

ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన బీజేపీ నాయకులు

ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన బీజేపీ నాయకులు
X
Highlights

జిల్లా కేంద్రంలో మెదక్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిపై, బీజేపీ నాయకులు ఆకస్మిక తనిఖీ చేశారు.

మెదక్: జిల్లా కేంద్రంలో మెదక్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిపై, బీజేపీ నాయకులు ఆకస్మిక తనిఖీ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చోలా రాంచరణ్ యాదవ్ ఆధ్వర్యంలో, సుమారు వంద మంది బీజేపీ కార్యకర్తలు మెదక్ ఏరియా ప్రభుత్వ హాస్పటల్ కు చేరుకుని, అక్కడ శానిటేషన్ ఇతర సమస్యలపై గళమెత్తారు. వంద పడకల హాస్పటల్ లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ముఖ్యంగా శానిటేషన్ ఎక్కడపడితే అక్కడ అపరిశుభ్రత ఉండడంతో, బీజేపీ నాయకులు సూపరిడెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

అక్రమంగా పెట్టిన పార్కింగ్ ను తీసివేయాలని, సరైన సదుపాయాలు కల్పించాలని, పోస్టుమార్టంలో చేతివాటం, సూపరిడెంట్ అక్రమాలపై విచారణ చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్, జిల్లా నాయకులు వనపర్తి వెంకటేశం, ఆకుల విజయ్, గుండు మల్లేశం, బీజేపీ కార్యకర్తలు సుమారు 100మంది వరకు పాల్గొన్నారు. అనంతరం మెదక్ పట్టణంలో జరుగుతున్న సిసి రోడ్డు పర్యవేక్షణకు వెళ్లారు.

Web TitleBJP leaders Sudden visit to Medak area government hospital
Next Story