logo
తెలంగాణ

Etela Rajender: ఈటల ఇంటికి క్యూ కట్టిన బీజేపీ నేతలు

BJP Leaders Started To Etala Home
X

ఈటల రాజేందర్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Etela Rajender: ఈ నెల 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న ఈటల రాజేందర్.

Etela Rajender: బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఈటల ఇంటికి బయల్దేరి వెళ్లారు బీజేపీ నేతలు. పార్టీలో చేరికపై ఈటలతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ చర్చించనున్నారు. తరుణ్‌చుగ్‌తో పాటు ఈటల ఇంటికి డీకే అరుణ, లక్ష్మణ్‌, వివేక్‌, రఘునందన్‌, రాజాసింగ్‌, విజయశాంతి వెళ్లారు. ఈ నెల 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు ఈటల రాజేందర్.

మరోవైపు.. రేపు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాజీనామా అనంతరం.. గన్‌ పార్క్‌ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత స్పీకర్‌ కార్యాలయంలో రాజీనామా పత్రం సమర్పించనున్నారు ఈటల.

Web TitleBJP Leaders Started To Etala Home
Next Story