శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తో బీజేపీ నేతల భేటీ

శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తో బీజేపీ నేతల భేటీ
x
Highlights

ఆపరేషన్‌ ఆకర్షణ్‌ను బీజేపీ వేగవంతం చేస్తోంది. గ్రేటర్‌లో కమలం జెండా ఎగరేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. పలు పార్టీల్లోని అసంతృప్తి నాయకులతో బీజేపీనేతలు వరుసగా భేటీ అవుతున్నారు.

ఆపరేషన్‌ ఆకర్షణ్‌ను బీజేపీ వేగవంతం చేస్తోంది. గ్రేటర్‌లో కమలం జెండా ఎగరేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. పలు పార్టీల్లోని అసంతృప్తి నాయకులతో బీజేపీనేతలు వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న అగ్ర నేతలతో చర్చలు జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి, సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.

తాజాగా టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్‌ సమావేశమయ్యారు. బీజేపీలోకి రావాలని స్వామిగౌడ్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దివంగత మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కమలం కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories