ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన బిజెపి నాయకులు

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన బిజెపి నాయకులు
x
Highlights

మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం మంగపేట మండల కో ఆర్డినేటర్ బొడ రమణయ్య సమక్షంలో తనిఖీ చేయడం జరిగింది.

మంగపేట: మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం మంగపేట మండల కో ఆర్డినేటర్ బొడ రమణయ్య సమక్షంలో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా అక్కడ ఉన్నటువంటి రైతులను కలిసి ధాన్యం కొనుగోలు వివరాలును తెలుసుకొనగా వ్యవసాయ అధికారులు తేమను చూసి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులు తెలుపగా కొనుగోలు నిర్వాహకులకు చెబితే 40 కేజీల బస్తా ధాన్యం కొనుగోలు చేస్తే 41 కేజీ తూకం వెయ్యగా లారీ ధాన్యం లోడ్ చేసి మిల్లర్లకు పంపిస్తే మిల్లర్లు కేజీ ధాన్యం హై స్పీడ్ ఫ్యాన్ అతి సమీపంలో పెడుతున్నారు. (గాలి వేగానికి చిన్న చిన్న గులుక రాళ్లు కొట్టుకుపోతయి. మేము పండించిన వరి గింజ ఎంత మిల్లర్ల హై స్పీడ్ ఫ్యాన్ గాలికి) అని రైతులు వాపోతున్నారు.

ధాన్యాన్ని మిల్లర్లు పంపిస్తే వారి 40 కేజీ బస్తాకి 4 కేజీల చొప్పున కటింగ్ చేస్తున్నారని.. కొన్ని చోట్ల లారీకి 5 క్వింటాల నుండి 10క్వింటాల వరకు మిల్లర్లు కటింగ్ చేస్తున్నరని చెప్పారు. రైతుల సమస్యలు విన్న ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, ములుగు నియోజకవర్గ నాయకులు తాటి కృష్ణ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు పండించిన ధాన్యం ఎలాంటి కటింగ్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించిన అధికారులు పొంతనలేని సమాధానం చెబుతూన్నారని, ఇప్పటికైనా సంబంధించిన మంత్రి క్షేత్ర స్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ధాన్యం కొనుగోలులో ఎలాంటి కటింగ్ లేకుండా చేసి రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో రైతులకుఅండగా న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన అండగా నిలుస్తుందని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories