logo
తెలంగాణ

బాసరకు వెళ్తున్న బండి సంజయ్‌ను అడ్డుకున్న పోలీసులు

BJP Leaders Clash With Police
X

బాసరకు వెళ్తున్న బండి సంజయ్‌ను అడ్డుకున్న పోలీసులు

Highlights

Bandi Sanjay: పోలీసులతో బీజేపీ కార్యకర్తల వాగ్వాదం

Bandi Sanjay: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించేందుకు వెళ్తున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షడు బండి సంజయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా బికనూర్ టోల్ గేట్ దగ్గర బండి సంజయ్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు వెళ్లకుండా వాహనాలకు వలయంగా నిల్చున్నారు.

దీంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే జాతీయరహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఎవరు అడ్డుకున్నా ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను కలిసి మాట్లాడుతానని.. బండి సంజయ్ స్పష్టం చేశారు.

Web TitleBJP Leaders Clash With Police | TS News
Next Story