BJP: గ్రామాలు, బస్తీల బాట పట్టిన బీజేపీ నాయకులు

BJP leaders Are Palle Bata
x

BJP: గ్రామాలు, బస్తీల బాట పట్టిన బీజేపీ నాయకులు

Highlights

BJP: గావ్ చలో అభియాన్‌లో బాగంగా పల్లె బాట

BJP: తెలంగాణ బీజేపీ గ్రామాల బాట పట్టింది. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని డివిజన్లలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి పోలింగ్ బూత్ అధ్యక్షుడి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 8 వరకు బీజేపీ ఈ కార్యక్రమాలు చేపట్టనుంది.

గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశంలో ఉన్న 2 లక్షల 70 వేల గ్రామ పంచాయతీలకు, 7 లక్షల గ్రామాలకు, అర్బన్ ఆవాసాలకు పార్టీ నేతలు వెళ్లేలా పార్టీ ప్లాన్ చేసింది. పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణలొని 12 వేల 769 గ్రామ పంచాయతీల్లోని 35 వేల పోలింగ్ బూతులకు పార్టీ శ్రేణులు వెళ్లనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కిషన్ రెడ్డితో పాటు.... రాష్ట్ర అగ్రశేణి నాయకత్వ మంతా.... గ్రామాల బాట పట్టారు. కార్పొరేషన్‌లోని డివిజన్ అయితే... తన డివిజన్ వదిలి మరో డివిజన్‌కి వెళ్తారు. గ్రామాల్లో అయితే గ్రామం వదిలి మరో గ్రామానికి వెళ్తారు. 24 గంటల పాటు గ్రామంలో ఉండి కార్యకర్తలతో ముచ్చటిస్తారు. అభియాన్‌లో భాగంగా సామాజిక వర్గాల పెద్దలను.. ఆధ్యాత్మిక కేంద్రాలను నేతలు దర్శించుకోనున్నారు.

గావ్ చలో కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తారు. గ్రామాలకు వెళ్లి ప్రతిష్టిత వ్యక్తులను కలవడంతో పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని జాతీయ నాయకత్వం భావిస్తోంది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా 17 కోట్ల ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో 22 కోట్ల ఓట్లు సాధించింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 51 శాతం ఓట్లు సాధించాలనేదే లక్ష్యంగా పెట్టుకుని కార్యక్రమాలను సిద్ధం చేస్తోంది బీజేపీ.

Show Full Article
Print Article
Next Story
More Stories