వైఫల్యాల తుగ్లక్ పాలనలో ఇది.. సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

వైఫల్యాల తుగ్లక్ పాలనలో ఇది.. సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం కేసీఆర్ పిచ్చి నిర్ణయంతో రైతులకు తీరని నష్ట్రం...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం కేసీఆర్ పిచ్చి నిర్ణయంతో రైతులకు తీరని నష్ట్రం జరిగిందని ఆమె విమర్శించారు. నియంత్రిత సాగు నిర్ణయంతో నష్టపోయిన రైతులకు ఎవరు బాధ్యులు? తల తిక్క ముఖ్యమంత్రి పిచ్చి నిర్ణయంతో తీరని నష్టం జరిగింది. ఎన్నో వైఫల్యాల తుగ్లక్ పాలనలో ఇది మరో ప్రహసనం. ఇప్పుడు రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నప్పుడు రైతు బంద్ పెట్టి ఎందుకు సతాయించావు? అని ట్వీట్ చేశారు.

ఇటీవలే తెలంగాణలో వానకాలంలో నియంత్రిత సాగు విధానాన్ని సర్కార్ అమల్లోకి వచ్చిన తీసుకొచ్చింది. రైతులు ఓకే రకమైన పంటలు వేయకుండా.. డిమాండ్ ఉన్న పంటలనే వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్షాకాలం సీజన్ ముగిసి..రైతులు యాసంగి పంటకు సిద్ధమవుతున్న వేళ.. నియంత్రిత సాగుపై సీఎం కేసీఆర్ మరోసారి మాట్లాడారు. రాష్ట్రంలో నియంత్రిత సాగు అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులు తమకు నచ్చిన పంటను పండించవచ్చని.. నచ్చిన చోట అమ్ముకోవచ్చని తెలిపారు.
Show Full Article
Print Article
Next Story
More Stories