కేసీఆర్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి: విజయశాంతి

కేసీఆర్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి: విజయశాంతి
x

విజయశాంతి ఫైల్ ఫోటో 

Highlights

కేసీఆర్ సర్కార్‌ను టార్గెట్ చేశారు తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి.

తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి కేసీఆర్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాలం దగ్గరపడిందని విమర్శించారు. నిర్ణయాలు తీసుకోవడమే కానీ వారి ఆచరించడంలో తెలంగాణ సర్కారు విఫలమవుతూనే ఉందని విమర్శించారు. ఫిబ్రవరి 1 నుంచి కొన్ని తరగతుల కోసం పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు కానీ, కరోనా నిబంధనలను అమలు చేసే పరిస్థితి మాత్రం కనిపించడంలేదని పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తికి ముందే ఈ సమస్యలున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వీటిపై స్పందించలేదు. ఆనాడే ఏమీ చెయ్యని ప్రభుత్వం ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో చేతులెత్తెయ్యడం తప్ప ఈ పరిస్థితిని మెరుగుపరుస్తుందన్న ఆశలు కలగడంలేదు. ఇవేకాదు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత, వసతిగృహాల్లో సౌకర్యాల లేమి వంటి మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. పరిస్థితులు బాగున్నప్పుడే విద్యావ్యవస్థ మెరుగుదలపై దృష్టి సారించని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడేదో ఉద్ధరిస్తుందనుకోవడం వెర్రితనం తప్ప మరొకటి కాదు" అంటూ నిశిత విమర్శలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వందలాది స్కూళ్లలో నీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. దానికితోడు పారిశుద్ధ్య సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఈ సమస్యలు అమ్మాయిల పాలిట బాగా ఇబ్బందికరంగా మారాయి. దీనికి సంబంధించి మీడియాలోనూ కథనాలు వచ్చాయి. గణాంకాలతో సహా పేర్కొన్నారు. ఈ సమస్యల కారణంనే అమ్మాయిలు పాఠశాలలకు దూరమవుతున్నారు. బాలికల డ్రాపౌట్లు పెరగడానికి ఇదే కారణం" అని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories