Top
logo

టీఆర్ఎస్ ప్రభుత్వంపై లక్షణ్ తీవ్ర విమర్శలు!

టీఆర్ఎస్ ప్రభుత్వంపై లక్షణ్ తీవ్ర విమర్శలు!
X
Highlights

దుబ్బాక గెలుపు ఉత్సాహంతో బీజేపీ గ్రేటర్ ఫైట్ కు సిద్దమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు.

దుబ్బాక గెలుపు ఉత్సాహంతో బీజేపీ గ్రేటర్ ఫైట్ కు సిద్దమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. దుబ్బాక ఎన్నికల ప్రభావంతో గ్రేటర్ ఎన్నికలు ఆలశ్యమయితే బీజేపీ ఇంకా బలపడే అవకాశం ఉందని కేసీఆర్ కుట్ర పూరితంగా ముందుగానే ఎన్నికలకు వెళ్తుందని విమర్శించారు. వరదలతో హైదరాబాద్ తల్లడిల్లితే కేసీఆర్ కనీసం బయటకు కూడా రాలేదని.. కరోనా, వరదలను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బీహార్ నుంచి దుబ్బాక వరకు బీజేపీ గెలిచిందన్న లక్షణ్.. గ్రేటర్ లోనూ బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇక అటు హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్‌ అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశమైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ సమావేశంలో నేతలు చర్చించారు. బండి సంజయ్‌ నేతృత్వంలో 100 డివిజన్ల మీదుగా పాదయాత్ర చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీని కోసం రోడ్‌ మ్యాప్‌పై కూడా సమావేశంలో చర్చించారు నేతలు.

ఇక త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ఇంచార్జీలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి భుపెందర్ యాదవ్ ని ఇంచార్జ్ గా నియమించగా, కర్ణాటక మంత్రి సుధాకర్, మహారాష్ట్ర బీజేపీ విప్ ఆశిష్, గుజరాత్ బీజేపీ కార్యదర్శి ప్రదీప్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డిని సహా ఇంచార్జ్ లు గా నియమించారు.

Web TitleBJP Leader Lakshman comments on KCR Government
Next Story