పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వ బ్యాన్‌ను స్వాగతించిన బీజేపీ కృష్ణసాగర్

BJP Leader Krishna Sagar Rao Welcomes Centre’s Decision to Impose Ban on PFI
x

పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వ బ్యాన్‌ను స్వాగతించిన బీజేపీ కృష్ణసాగర్

Highlights

*ప్రధాని మోడీ నాయకత్వంలోని బలమైన ప్రభుత్వం... మాత్రమే ఇటువంటి నిర్ణయం తీసుకోగలదని వ్యాఖ్య

Krishna Sagar Rao: పీఎఫ్ఐ, దాని అన్ని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణ సాగర్ రావు అన్నారు. జాతీయ భద్రత దృష్ట్యా ప్రధాని మోడీ నాయకత్వంలోని బలమైన ప్రభుత్వం మాత్రమే అటువంటి నిర్ణయం తీసుకోగలదని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ బీజేపీయేతర ప్రభుత్వాలు వాళ్ల రాజకీయ అవసరాల కోసం మైనార్టీల బుజ్జగింపులో భాగంగా పీఎఫ్ఐ వంటి సంస్థలను దేశవ్యాప్తంగా ఎదగనిచ్చాయన్నారు. సామాజిక సంస్థల ముసుగులో విభజన శక్తులు, మత విద్వేషాలను రెచ్చగొట్టే సంస్థలు దేశవ్యాప్తంగా నెట్ వర్క్ లు నిర్మించకుండా మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆపుతాయని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories