టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత కృష్ణసాగర్‌రావు ఫైర్

టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత కృష్ణసాగర్‌రావు ఫైర్
x
Highlights

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని బలవంతంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి కే కృష్ణసాగర్ రావు తెలిపారు. పోలీసుల అత్యుత్సాహం సోషల్ మీడియాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని బలవంతంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి కే కృష్ణసాగర్ రావు తెలిపారు. పోలీసుల అత్యుత్సాహం సోషల్ మీడియాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుందన్నారు.బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందనరావు లక్ష్యంగా పోలీసులు అక్రమ దాడులు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఎన్నికల సంఘం కేసీఆర్ చేతిలో కీలు బొమ్మలా మారిందని కృష్ణసాగర్ రావు అన్నారు. బీజేపీ అభ్యర్థికి అడుగడుగునా ఆటంకాలు కల్పించడమే ధ్యేయంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం నిద్ర లేచి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేయాలి అని అయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories