తెలంగాణలో CBI దర్యాప్తు అనుమతి ఉపసంహరణపై డీకే అరుణ ఫైర్‌

DK Aruna: కల్వకుంట్ల కుటుంబం ఎక్కడ దాగినా బయటకు తీసుకొస్తాం

Jyothi
Published on: 30 Oct 2022 1:26 PM IST
BJP Leader DK Aruna Fires on Withdrawal of Permission for CBI investigation in Telangana
X

తెలంగాణలో CBI దర్యాప్తు అనుమతి ఉపసంహరణపై డీకే అరుణ ఫైర్‌

DK Aruna: తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం ఎక్కడ దాక్కున్నా బయటకు తీసుకొస్తామని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో సీబీఐ జోక్యం ఉండొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్ట్ 30న జి ఓ 51 తీసుకొచ్చి బయటపెట్టకుండా.. దాచి పెట్టడం దుర్మార్గమన్నారు. తమను ఈడి, మోడీ, బోడి ఏమి చేయలేరని Ktr అనడం వెనుక అసలు రహస్యం ఇదేనన్నారు డీకే అరుణ. మీరు సుద్ద పూసలైతే, సీబీఐకి ఎందుకు భయపడుతున్నారో ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు మునుగోడు సభలో చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story