విభజన రాజకీయాలు చేయడం కేటీఆర్‌కు అలవాటైపోయింది

విభజన రాజకీయాలు చేయడం కేటీఆర్‌కు అలవాటైపోయింది
x
Bjp Laxman
Highlights

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి అని రంగాలకు నిధులు వచ్చాయన్నారు. కేంద్రం తెలంగాణకు కేటాయించిన నిధులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

దక్షిణాది రాష్ట్రా పట్ల కేంద్రప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, బుధవారం సీఐఐ డిఫెన్స్ కాన్‌క్లేవ్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రాజెక్టులు అమలుకు తెలంగాణ గుర్తుకు రావడంలేదా అని ప్రశ్నించారు. రక్షణ రంగంలో హైదరాబాద్‌కు గొప్ప చరిత్ర ఉందని ఆ చరిత్రను కేంద్రం మరిచిపోయిందని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు లక్షణ్ విరుచుపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి అని రంగాలకు నిధులు వచ్చాయన్నారు. కేంద్రం తెలంగాణకు కేటాయించిన నిధులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం టీఆర్ఎస్ నాయకులకు అలవాటైందని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని లక్ష్మణ్ అన్నారు. ట్విట్టర్ లో మాత్రమే కేటీఆర్ మాట్లాడతారని, బయటకు వచ్చి చూస్తే బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు ఏం చేసిందో తెలుస్తుందిన్నారు. ఢిల్లీలో ఓ రకంగా, తెలంగాణలో ఓ రకంగా కేసీఆర్, కేటీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రక్షణ శాఖలో భూములు స్వాహా చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నించింది, దానిని బీజేపీ అడ్డుకోవడంతో ఫ్లాన్ మార్చి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పని అయిపోయిందని, తెలంగాణ సెంటిమెంట్ తో ఇప్పటి వరకూ టీఆర్ఎస్ ఎదిగింది. ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత వచ్చిందని లక్ష్మణ్ విమర్శించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories