TS BJP: పేదల డబుల్ బెడ్రూమ్ ఇండ్లకోసం బీజేపీ పోరుబాట.. ఇవాళ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా.. రాస్తారోకో

TS BJP: పేదల డబుల్ బెడ్రూమ్ ఇండ్లకోసం బీజేపీ పోరుబాట.. ఇవాళ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా.. రాస్తారోకో
x
Highlights

TS BJP: అమిత్‌షా బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించనున్న కిషన్ రెడ్డి

TS BJP: పేదల డబుల్ బెడ్రూమ్ ఇండ్లకోసం బీజేపీ పోరుబాట పట్టింది. ఇవాళ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా, రాస్తారోకోలు నిర్వహించబోతున్నారు. పేదలకోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇండ్లు కేటాయించి, నిధులు విడుదల చేసినా... కేసీఆర్ సర్కార్‌ నిర్లక్ష్యం చేసిందన్నారు.

ప్రగతి భవన్, సెక్రటేరియట్‌ భవనాలను త్వరితగతిన కట్టుకున్నప్పటికీ... పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టివ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలను, మంత్రులను ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు.

ఈనెల 27 తేదీన ఖమ్మంలో బిజెపి విజయసంకల్ప సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. దీంతో ఇవాళ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖమ్మంజిల్లాలో పర్యటనకు వెళ్లనున్నారు. ఖమ్మంలో విజయసంకల్ప సభ ఏర్పాట్లపై పార్టీ శ్రేణులతో సన్నాహాక సమావేశం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories