బండి సంజయ్‌ పాదయాత్రపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

*పాదయాత్రకు అనుమతివ్వాలంటూ పిటిషన్‌ దాఖలు

Jyothi
Published on: 28 Nov 2022 11:21 AM IST
BJP has approached the High Court on Bandi Sanjay Padayatra
X

బండి సంజయ్‌ పాదయాత్రపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

BJP: బండి సంజయ్‌ పాదయాత్రపై హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ. పాదయాత్రకు అనుమతివ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు కమలనాథులు. ఈ పిటిషన్‌పై కాసేపట్లో హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ నిర్మల్ జిల్లా భైంసా నుంచి 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం కావల్సి ఉంది. అయితే.. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి నిరాకరించారు పోలీసులు. అలాగే.. బహిరంగ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో.. ప్రభుత్వం కావాలనే పాదయాత్ర అడ్డుకుంటోందని బండి సంజయ్ మండిపడ్డారు. సభకు అనుమతులపై న్యాయపోరాటానికి సిద్ధమైన కమలనాథులు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాదయాత్రకు ముందు అనుమతి ఇచ్చి.. చివరి నిమిషంలో రద్దు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక.. బండి సంజయ్ పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

Jyothi

Jyothi

Next Story