BJP: తెలంగాణలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బ

BJP Graph Is Falling Day By Day In Telangana
x

BJP: తెలంగాణలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బ

Highlights

BJP: గెలుపు అవకాశాల నుంచి పాతాళానికి పడిపోతున్న కమలం

BJP: ఈ బీజేపీకి ఏమైంది..? ఎలా ఉన్న పార్టీ ఎలా అయింది. ఈసారి అధికారం పక్కా అనే ధీమా నుంచి ఎందుకీలా పాతాళానికి పడిపోతోంది. సీనియర్ లీడర్లంతా ఒక్కొక్కరుగా ఎందుకు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి రోజు రోజుకి ఇంతలా దిగజారడానికి కారణమేంటి..? ప్రత్యర్థులపై ఎందుకు దూకుడుగా వెళ్లలేకపోతోంది. కమలం పార్టీలో లోపం ఎక్కడుంది.? హైకమాండ్ నుంచి నేతలకు సరైన దిశా నిర్ధేశం లేకనా..? లేక పార్టీలో భవిష్యత్తు లేదనే అనుమానంతో కమలాన్ని వీడుతున్నారా..? ఎన్నికల టైంలో పార్టీ బలబడాల్సింది పోయి..ఎందుకీలా చేతులెత్తేస్తోంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, వివేక్ బీజేపీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో సీనియర్ నేత కూడా తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్టైంది.

బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అనే పొజిషన్ నుంచి మెల్ల మెల్లగా డ్రాప్ అవుట్ అవుతుంది బీజేపీ. కనీసం త్రిముఖ పోరులో అయినా ఉంటుందా అనే గందరగోళం నెలకొంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ ప్రకటించారు. గద్వాల స్థానం నుంచి బీసీ లీడర్‌కు అవకాశం ఇస్తామని ఆమె ప్రకటించారు. బీజేపీ కీలక నేతగా ఉన్న డీకే అరుణ పోటీ నుంచి తప్పుకోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి, వివేక్ బాటలోనే డీకే అరుణ కూడా పార్టీని వీడబోతున్నారా అనే ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ నుంచి బలమైన నేతగా ఉన్నారు డీకే అరుణ. గత ఎన్నికలో ఓటమితో ఈసారి పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ చివరికి పోటీనే చేయడం లేదని ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకు డీకే అరుణ పార్టీలో ఉంటారా లేక జంప్ అవుతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పార్టీ కేడర్‌లో.

ఇప్పటికే బీజేపీకి చాలా మంది నేతలు గుడ్ బై చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటూ బహిరంగ విమర్శలు చేస్తూ.. ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి, తాజాగా వివేక్‌ల రాజీనామా పార్టీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. వీళ్ల బాటలోనే మరో సీనియర్ నేత కొండా విశ్వశ్వర్ రెడ్డి కూడా వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి సీటును రవి కుమార్ యాదవ్ కు ఇవ్వాలని కొండా పట్టుబడుతున్నారు. శేరిలింగంపల్లి సీటు విషయంలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు చర్చలు నడుస్తున్నాయి. దీంతో శేరిలింగంపల్లి స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే బీజేపీకి రాజీనామా చేస్తానంటున్నారు కొండా. చేవెళ్ల పార్లమెంట్ మొత్తం ఓట్లలో 30% ఓట్లు శేరిలింగంపల్లిలోనే ఉంటాయని.. రేపు పార్లమెంట్ గెలవాలి అంటే శేరిలింగంపల్లి కీలకంగా మారుతుంది అంటున్నారు. మరి బీజేపీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

టికెట్ దక్కకపోవడంతో బీజేపీ హైకమాండ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాకేష్ రెడ్డి BJPకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీకి భవిష్యత్ లేదు, పార్టీలో యువతకు ఆదరణ లేదని ఆరోపణలు గుప్పించారు. సిద్ధాంతాల పేరుతో యువతను బానిసలుగా వాడుకుంటున్నారని రాకేష్ రెడ్డి విమర్శించారు. సర్వేలు, ప్రజలు రాకేష్ రెడ్డిని గుర్తించినా, పార్టీ గుర్తించకపోవడం బాధాకరం అన్నారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని స్పష్టం చేశారు రాకేష్ రెడ్డి.

ఢిల్లీ లిక్కర్ కేసు పరిణామం, బండి సంజయ్ మార్పు, కర్ణాటక ఫలితం తెలంగాణలో బీజేపీని తీవ్రంగా దెబ్బ తీసింది. అప్పటి వరకు బలంగా ఉన్న కమలం గ్రాఫ్ పడిపోవడం స్టార్ట్ అయింది. బీఆర్ఎస్‌తో బీజేపీకి అవగాహన ఒప్పందం ఉందని, అందుకే బండి సంజయ్ మార్పు జరిగిందనే వార్తలు..పార్టీకీ తీవ్ర నష‌్టం చేశాయి. ఫలితంగా.. బీజేపీ గ్రాఫ్ పడితే.. ఒక్కసారిగా కాంగ్రెస్ పుంజుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కాంగ్రెస్ వైపు మళ్లింది.

Show Full Article
Print Article
Next Story
More Stories