తెలంగాణలో ఇక బీజేపీ పవర్ ప్లే

తెలంగాణలో ఇక బీజేపీ పవర్ ప్లే
x
Highlights

తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టిందా....? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష‌్యంగా అడుగులు వేస్తుందా...? అందుకే తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసైని గవర్నర్‌గా...

తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టిందా....? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష‌్యంగా అడుగులు వేస్తుందా...? అందుకే తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసైని గవర్నర్‌గా నియమించిందా...? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చబోతున్నారా...? కొత్త చీఫ్ ఎవరు కాబోతున్నారు...?

దక్షిణాదిలో బలపడేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. పలు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు ఉవ్వూళ్లూరుతోంది. అందుకోసం ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తోంది. పలు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు అందుకే చేపట్టిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజీపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో క్యాడర్‌లో జోష్ నింపే చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే తెలంగాణ గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ చీఫ్‌గా పని చేసిన తమిళిసైని నియమించిందన్న చర్చ సాగుతోంది.

ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ అధిష్టానం. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు స్థానాలు గెలుపొందడం బీజేపీలో ఉత్సాహం నింపింది. ఇటు కాంగ్రెస్ బలహీనపడటం టీడీపీ నామమాత్రమే అయిపోవడం బీజేపీకి కలిసివస్తోంది. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమన్న సంకేతాలు ప్రజల్లో ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ పెద్దలు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడున్న పార్టీ చీఫ్ లక్ష్మణ్‌ను మార్చబోతున్నారని తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడిని నియమించే యోచనలో అధిష్టానం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై కమలం పార్టీ కసరత్తు చేస్తోందని తెలిసింది.

తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి దక్కించుకునేందుకు పలువురు సీనియర్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దూకుడుగా వెళ్లే నాయకుడి కోసం అన్వేషణ మొదలెట్టినట్లు తెలుస్తుంది. జాతీయ నాయకుల ద్వారా పదవి చేజిక్కించుకునేందుకు నేతలు పైరవీలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories