ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీ భారీ బహిరంగ సభ

BJP Chief JP Nadda to Visit Telangana Today | Telangana News
x

ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీ భారీ బహిరంగ సభ

Highlights

Mahbubnagar: సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Mahbubnagar: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపటానికి సభ దోహదపడుతుందని నేతలు చెబుతున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. పట్టణం, సభాప్రాంగణం కాషాయ మయమయ్యింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీగా జనసమీకరణ చేసేందుకు చర్యలు చేపట్టారు.

గత 22 రోజులుగా సాగుతున్న బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంగ్రామయాత్ర మహబూబ్ నగర్ పట్టణానికి చేరుకోనుంది. పార్టీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అటు నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్ నగర్ కు చేరుకుంటారు. మొదట అన్నపూర్ణ ఫంక్షన్ హాలులో రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నడ్డా పాల్గొంటారు. తర్వాత బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ఏర్పాట్లను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, యాత్ర ఇంఛార్జ్ మనోహర్ రెడ్డి తదితర నేతలు పరిశీలించారు. సభతో జిల్లాలో తమ సత్తా ఏంటో చూపుతామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories