నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

BJP Central Election Committee Meeting Today
x

నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

Highlights

BJP: తెలంగాణ, రాజస్థాన్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చ

BJP: తెలంగాణ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది బీజేపీ. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలవనుండటంతో త్వరితగతిన అభ్యర్తుల్ని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది. ‎ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనుంది బీజేపీ. ఈ సమావేశంలో తెలంగాణతో పాటు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రెండవ విడత అభ్యర్ధుల ఎంపికపై చర్చించనున్నారు నేతలు. ఇక కేంద్రానికి పంపాల్సిన లిస్టుపై నిన్న బిజెపి నేత ప్రకాష్ జవదేకర్ నివాసంలో తెలంగాణ బిజెపి నేతలు సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, డా.కె.లక్ష్మణ్ , బండి సంజయ్, డికె.అరుణ హాజరయ్యారు. తెలంగాణ నేతలు ఇవాళ మరోసారి సమావేశమై సాయంత్రం అమిత్ షాకు కోర్ కమిటీ ఖరారు చేసిన జాబితాను సమర్పించనున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. దీంతో ఇవాళ్టి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ఏ క్షణమైనా మూడో జాబితా విడుదల చేసే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories