Bird flu effect: చికెన్ కోనాలంటే జంకే.. తెలంగాణలో పడిపోయిన చికెన్‌ ధరలు

Bird flu effect: చికెన్ కోనాలంటే జంకే.. తెలంగాణలో పడిపోయిన చికెన్‌ ధరలు
x

చికెన్ ధరలు 

Highlights

దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాల బర్డ్ ఫ్లూ భయం బెంబేలెత్తించింది.

దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాల బర్డ్ ఫ్లూ భయం బెంబేలెత్తించింది. ఇప్పటికే ఈ రకమైన ఫ్లూ బయటపడినట్టు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ తెలిపింది. వలస పక్షుల్లోనే ఎక్కువగా ఈ ఫ్లూ కనిపిస్తోందని కేంద్రం వెల్లడించింది. బర్డ్ ఫ్లూ కారణంగా దేశ వ్యాప్తంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఇప్పటికే ఏవియన్‌ ఇన్‌ప్లూయెంజా వైరస్‌ బారిన పడిన వేలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయి. రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.

ఓవైపు కరోనా కల్లోలంతో సతమతమవుతున్న ప్రజలకు బర్డ్ ఫ్లూ మరింత భయపెడుతోంది. అటు ఫ్లూ భయంతో చికెన్‌, ఎగ్స్‌ ధరలు పడిపోయాయి. కోడి మాంసం కొనేందుకు జనాలు ముందుకు రావడం లేదు. దీంతో వ్యాపారులు బోరుమంటున్నారు. చికెన్‌ను శుభ్రంగా కడిగి బాగా వేడి చేసుకుని తినాలని అధికారులు సూచిస్తున్నారు. హాటళ్లలో పెట్టే చికెన్ నాణ్యతపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయి. గతంలో లైవ్‌ చికెన్‌ను వంద రూపాయాలకు అమ్మిన వ్యాపారులు.. ఇప్పుడు 50 నుంచి 60 రూపాయలకే అమ్ముతున్నారు. అయినప్పటికీ ఎవరూ కొనేందుకు ముందుకురావడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోనూ ధరలు 25-30 శాతం పడిపోయాయి. గత వారం ఇక్కడ 150-200 రూపాయలకు అమ్ముడుపోయిన కేజీ చికెన్‌.. ఇప్పుడు 130-140 రూపాయలకే అమ్మడవుతోంది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం చికెన్ ధరలపై పడింది. కోళ్ల మరణాలతో జనం ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో చికెన్ ధరలు పతనమైయ్యాయి. జనం మంసం కోనాలంటే జంక్కుతున్నారు. నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో చికెన్ ధరలు కేలో 250 రూపాయిలు ఉండేది. గుడ్లను కూడా కొనేందుకు ముందుకు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఇప్పుడు 180 రూపాయల నుంచి 160 రూపాయల వరకు ఉంది. పక్క రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories