ఇక హాయిగా ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చా?

ఇక హాయిగా ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చా?
x
ఫ్లెక్సీలు
Highlights

విశ్వనగరంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి కొన్ని సంస్థలు కూడా తోడవుతున్నాయి. మొన్నటి వరకూ నగరంలో ఫ్లెక్సీలు కట్టడం...

విశ్వనగరంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి కొన్ని సంస్థలు కూడా తోడవుతున్నాయి. మొన్నటి వరకూ నగరంలో ఫ్లెక్సీలు కట్టడం నిషేధం కానీ ఇక యధేచ్ఛగా ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చంటోంది ఓ సంస్థ ఇంతలోనే ఎంత మార్పు? ఇంతకీ ఈ మార్పుకు కారణమేంటి?

ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం పాడైపోతుందని మనం రోజూ వింటూనే ఉన్నాం. రోజు వారి అవసరాలకు తప్పనిసరి పరిస్థితులల్లో ప్లాస్టిక్ ను, ప్లాస్టిక్ ఉత్పాదకాలను వినియోగిస్తూనే ఉన్నాం. ప్రభుత్వం మరోవైపు ప్లాస్టిక్ వాడకం వద్దు అంటూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. హైదరాబాద్ మహా నగరంలో జీహెచ్ఎంసీ ప్లాస్టిక్ ఉత్పాదకాలు వాడకూడదంటూ ఏకంగా ఆదేశాలు సైతం జారీ చేసింది. ముఖ్యంగా రాజకీయ నేతలు, అభిమాన నాయకులకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఏర్పాటు చేసుకునే ఫ్లెక్సీ లను వెంటనే తొలగిస్తున్నారు.

అయితే ఇప్పటినుంచి నాయకులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫ్లెక్స్ లు కట్టుకోవచ్చు అంటోంది ఓ సంస్థ. ఇప్పటివరకు వాడేసిన ప్లాస్టిక్ ను రిసైకిల్ చేసిన ఈ సంస‌్థ నగరంలో కొత్త రకం ఫ్లెక్స్ లను అంటుబాటులోకి తీసుకువచ్చింది. పర్యావరణానికి ఎలాంటి హానికరం కాని, కాటన్ ఫ్లెక్సీ లను ఈ సంస్థ పరిచయం చేస్తోంది. తాము తయారు చేసిన ఫ్లెక్సీ కేవలం నెల నుంచి ఐదు నెలల్లో భూమిలో పూర్తిగా కలిసి పోతుందని చెబుతున్నారు. కాటన్ తో తయారు చేసే ఈ ఫ్లెక్సీని చిన్న బానర్ల దగ్గరి నుంచి పెద్ద కటౌట్ల వరకు ఉపయోగించవచ్చు అని ఆ సంస్థ ప్రతినిదులు చెబుతున్నారు.

ఇలా త్వరగా జీర్ణమైపోయే ఫ్లెక్సీ లు అందుబాటులోకి వస్తే ఇక తమ ఇష్టమైన నాయకులకు సంతోషంగా బానర్లు కట్టుకుంటామని లీడర్లు చెబుతుంటే తమ కంపెనీల అడ్వర్టైజ్ మెంట్ లు కూడా దీనితో చేసుకోవచ్చు అని సంతోషపడుతున్నారు వ్యాపారస్తులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories