KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్..రెండు కేసులు నమోదు

KTR to Delhi Tomorrow
x
Highlights

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఆయనపై నకిరేకల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నకిరేకల్...

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఆయనపై నకిరేకల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నకిరేకల్ పట్టణంలో పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేటీఆర్ పై మున్సిపల్ చైర్ పర్సన్ చౌగోని రజిత, కాంగ్రెస్ నేతలు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్ తోపాటు సోషల్ మీడియా ఇంచార్జి మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ కుమార్ లపై రెండు వేరువేరు కేసులు నమోదు చేశారు. పేపర్ లీక్ అయిందంటూ వెబ్ సైట్ లో వచ్చిన వార్తను వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో షేర్ చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు ఒక మైనర్ బాలికతోపాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో 6గురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories