TS Assembly: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన భట్టి

Bhatti Released a White Paper in the TS Assembly on the Financial Situation of The State
x

TS Assembly: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన భట్టి

Highlights

TS Assembly: దశాబ్ద కాలంలో ఆర్థిక అరాచకం రాజ్యమేలింది

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ బ్యాటిల్ ఫీల్డ్‌ను తలపించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ వైట్ పేపర్ సెంట్రిక్‌గా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు వ్యాఖ్యలకు పలురువు మంత్రులు కౌంటర్లు ఇచ్చారు. 10 ఏళ్లగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కోలుకోలేని అప్పుల్లో కూరుకుపోయేలా చేసిందని ఎద్దేవా చేశారు.

ఇక 42 పేజీలతో కూడిన శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను సవిరంగా చెప్పే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. 2014-23 మధ్య బడ్జెట్‌ కేటాయింపుల్లో వాస్తవ వ్యయం 82.3 శాతమే ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో మొత్తం అప్పులు 6లక్షలా 71వేల 757 కోట్లు ఉండగా.. తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం 72వేల658 కోట్లుగా ఉందని స్వేత పత్రంలో ప్రభుత్వం పేర్కొంది. పదేళ్లలో సగటున 24.5 శాతం రాష్ట్ర అప్పులు పెరిగిందని.. కాగ్ రిపోర్ట్‌లోని అంశాలను నివేదికలో వెల్లడించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

మొత్తం బడ్జెట్‌ వ్యయంలో ఆరోగ్యంపై ఖర్చు 5 శాతం మాత్రమే.. బడ్జెట్‌కు వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉందని.. పదేళ్లలో చేసిన ఖర్చుకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదన్న ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ.59 వేల 414 కోట్లుగా 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం ద్వారా వెల్లడించింది.

ప్రభుత్వం విడుదల చేసిన స్వేత పత్రం ప్రకారం రాష్ట్ర మెుత్తం అప్పులు రూ. 6లక్షలా 71వేల 757 కోట్లుగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం పెరిగింది. బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం ఏర్పడింది. ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు 3లక్షలా 89వేల673గా ఉన్నాయి. 2014 -15 నాటికి తెలంగాణ అప్పులు 72వేల 658 కోట్లు ఉండగా... 2014- 22 మధ్య సగటున 24.5 శాతం అప్పులు పెరిగాయి. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్రం మొత్తం అప్పులు 3లక్షలా 89వేల 673 కోట్లుగా ఉన్నాయి.

2015-16 జీఎస్డీపీలో రుణ శాతం 15 .7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉందని శ్వేతపత్రంలో ప్రభుత్వం వివరించింది. రెవెన్యూ రాబడిలో 34 శాతానికి రుణ చెల్లింపుల భారం పెరిగింది. రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం అవుతోంది. ప్రభుత్వమే చెల్లించే ఎస్పీవీల రుణాలు లక్షలా 85వేల 29 కోట్లు కాగా..ప్రభుత్వ హామీతో ఎస్పీవీల రుణ బకాయిలు 95వేల 462 కోట్లుగా ఉన్నాయి. ప్రభుత్వ హామీ లేని రుణాలు మరో 59వేల 414 కోట్లు ఉన్నట్లు స్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది.

2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 2023లో అప్పుల్లో కూరుకుపోయిందని భట్టి తెలిపారు. తెలంగాణ ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామని తెలిపారు. సవాళ్లు అధిగమించే దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు వేసిందని భట్టి విక్రమార్క అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories