Top
logo

బైంసా అల్లర్లు టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యం : ఎంపీ బండి సంజయ్

బైంసా అల్లర్లు టీఆర్ఎస్ సర్కార్  వైఫల్యం : ఎంపీ బండి సంజయ్Bandi Sanjay
Highlights

టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.

టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బైంసాలో అల్లర్లు టీఆర్ ఎస్ సర్కార్ వైపల్యం వల్లే జరిగాయని బండి సంజయ్ అరోపించారు. నెల రోజులు గడుస్తున్నా బాధితులకు సీఎం కేసీఆర్ పరామర్శించడంలేదని విమర్శించారు. బైంసా అల్లర్లపై కేంద్ర నిఘా సంస్థలతో విచారణ జరిపించాలని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. బైంసా ప్రజలకు కుల మతాల గొడవలు తెలియవని, కూలీ పనులు చేసుకునే వారని అన్నారు. హిందూవులపై దాడులు ఖండిస్తున్నామని తెలిపారు. అమాయక యువకులపై నాన్ బెయిల్ కేసులు పెడుతున్నారని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.


Web TitleBhainsa Incident Trs Govt Failure Says Karimnagar BJP MP Bandi Sanjay
Next Story


లైవ్ టీవి