Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ముందుకు బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లు

BC and SC bill introduced in Telangana assembly
x

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ముందుకు బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లు

Highlights

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టింది.

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణకు అవకాశం కల్పిస్తూ బిల్లును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశ పెట్టారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ,పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మారుస్తూ, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తూ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.

ఎన్నికలకు ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హమీ ఇచ్చింది. కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీ 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపనుంది. బీసీల రిజర్వేషన్ల అంశం గురించి తేలకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories