Kamareddy: స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ

Battery Explodes in a School Bus in Kamareddy
x

Kamareddy: స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ

Highlights

Kamareddy: కామారెడ్డి పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. ఓ స్కూల్‌ బస్సులో ప్రమాదం సంభవించింది.

Kamareddy: కామారెడ్డి పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. ఓ స్కూల్‌ బస్సులో ప్రమాదం సంభవించింది. బస్సులో బ్యాటరీ పేలడంతో భారీగా పొగలు వ్యాపించాయి. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యార్థులను కిందకు దింపి.. మరమ్మతులు చేశారు.

ఘటనా సమయంలో బస్సులో సుమారు 30 మంది స్టూడెంట్స్‌ ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కామారెడ్డిలోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories