Bathukamma Sarees 2021: బతుకమ్మ చీరల పంపిణీకి అంతా సిద్ధం

Bathukamma Sarees 2021 are Ready to Distribute From October 2 | Telangana News Today
x

బతుకమ్మ చీరల పంపిణీకి అంతా సిద్ధం 

Highlights

Bathukamma Sarees 2021: *30 డిజైన్లు, 20 విభిన్న రంగులతో చీరలు *అందుబాటులోకి 810 రకాల చీరలు

Bathukamma Sarees 2021: తెలంగాణ ఆడబిడ్డలు గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈ పండుగను మహిళలు ఆత్మగౌరవంతో జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అందించే బతుకమ్మ చీరల పంపిణీ రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. చేనేతకు చేయూత నివ్వాలనే ఆలోచనతో సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాలో మరమగ్గాలపై తయారు అయిన చీరలు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.

గతేడాది కంటే ఈ ఏడాది చాలా వెరైటీ డిజైన్‌లను రూపొందించారు. ఈ ఏడాది కోటి చీరలను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే 90శాతం చీరలు జిల్లా కేంద్రాలకు చేరాయి. గత నాలుగు ఏళ్లుగా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చేనేత చీరలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈసారి మరిన్ని అంగులతో 30 రకాల వెరైటీ డిజైన్లతో, 20 విభిన్న రంగులతో 600 నుంచి 800 రకాల చీరలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.

అందులో వెండి, బంగారు, జేరిలతో పాటు డాబి, జాకాడ్ అంచుల డిజైన్లతో పంపిణీకి సిద్ధం చేశామని జౌళిశాఖ ఎండీ శైలజరామయ్యర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను అక్టోబర్ 2న ప్రారంభించి, వారం రోజుల్లోనే పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories