Banswada: బాన్సువాడ అద్దె సమస్య ఎక్కువ అద్దె వల్ల షాపులు ఖాళీ

Banswada: బాన్సువాడ అద్దె సమస్య ఎక్కువ అద్దె వల్ల షాపులు ఖాళీ
x

Banswada: బాన్సువాడ అద్దె సమస్య ఎక్కువ అద్దె వల్ల షాపులు ఖాళీ

Highlights

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా, డివిజన్ కేంద్రంగా ఎదిగిన బాన్సువాడ పట్టణం దిన దినాన అభివృద్ధి చెందుతోంది.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా, డివిజన్ కేంద్రంగా ఎదిగిన బాన్సువాడ పట్టణం దిన దినాన అభివృద్ధి చెందుతోంది. దీంతో ఇక్కడి భూములకు, నివాస స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. చుట్టు పక్కల ఉన్న మండలాలు, గ్రామాలకు చెందిన ప్రజలు ఇక్కడే ప్లాట్లు కొనడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎంత అంటే సాధారణ వ్యక్తులు ఒక ప్లాట్ కొనలేని పరిస్థితి వరకు వచ్చింది. అంతలోనే భవన యజమానులు వ్యాపార సముదాయాలు, షట్టర్ల కిరాయిలు పెంచుతూ పోతున్నారు. కొంతకాలం పాటు ఇక్కడ వ్యాపారం బాగానే జరిగింది. బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, రాజీవ్ చౌరస్తా ప్రాంతాల్లో ఉన్న షేటర్ యజమానులు ప్రతి సంవత్సరం 10% కిరాయిలు పెంచుకుంటూ పోయారు. ఎంత అంటే రూ. 10,000 నుండి రూ.40,000వరకు తక్కువ కాకుండా శెట్టర్ల కిరాయి ఉంది. యజమానులు ఒకరిని చూసి ఒకరు కిరాయిలు పెంచుతూ పోతున్నారు.


అలాగే బాన్సువాడ చుట్టూ గ్రామాల్లో అక్కడక్కడ వారపు సంతలు ఏర్పాటు చేయడం, అక్కడే కొత్త షాపులు ప్రారంభం కావడంతో వస్తువులు అక్కడే లభించడం చుట్టు ప్రాంతాల ప్రజలు ఇక్కడ రావడం తగ్గింది దీంతో చాలావరకు పట్టణంలోని వ్యాపారం దెబ్బతిని కొనుగోలు తగ్గినవి. ఇంకో ముఖ్య విషయం ఇక్కడ కంపెనీలు లేకపోవడం, రైల్వే సౌకర్యం లేకపోవడం వ్యాపారాలు లేక వ్యాపారస్తులు నష్టపోయి కిరాయిలు భరించలేక షెట్టర్లు ఖాళీ చేస్తున్నారు. బస్టాండ్ చుట్టూ పక్కల, ప్రధాన రహదారి పైన ఎక్కడ చూసినా టులెట్ బోర్డు లు దర్శనమిస్తున్నాయి. బస్సులు ఫ్రీ ఉండడం కూడా ఒక కారణం కొనుగోళ్ల కొరకు ప్రజలు ఇక్కడి నుండి నిజామాబాద్ నగరానికి వెళ్లి పండగలు, పెళ్లి సంబంధిత కొనుగోలు చేయడంతో వ్యాపారాలు తగ్గి నష్టపోతున్నామని వ్యాపారస్తులు అంటున్నారు. ప్రస్తుతం వ్యాపారాలు లేక చివరకు బిజినెస్ బంద్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories