పంటల సాగుకు రుణాలివ్వని బ్యాంకులు

Banks that do not lend for crop cultivation
x

పంటల సాగుకు రుణాలివ్వని బ్యాంకులు

Highlights

Farmers Problems: *పాత బకాయి చెల్లిస్తేనే కొత్త రుణాలంటూ మెలిక

Farmers Problems: ప్రతి ఎకరాకు సాగునీరు తెలంగాణ సస్యశ్యామలం పంటల సాగులో మనమే నెంబర్ వన్... ఇలా తెలంగాణ ప్రభుత్వ ఏలికలు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ పంటలు సాగు చేసేందుకు బ్యాంకులు రుణాలివ్వడం లేదు. రైతు రుణ మాఫీ హామీ అమలు కాకపోవడంతో అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలిస్తామంటూ బ్యాంకు అధికారులు తెగేసి చెబుతున్నారు.

ఖరీఫ్ సీజన్ మొదలైంది. పెట్టుబడుల రుణాల కోసం బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారు. పాత బాకీలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామంటున్నారు బ్యాంకు అధికారులు. తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి లక్ష రూపాయలు వరకు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు కేవలం 30 వేల లోపు రైతులకు మాత్రమే వర్తిస్తుందంటూ ప్రకటించింది. ఇకపోతే రెండో విడతలో 50 వేల లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. నాలుగు ఏళ్లు గడిచిన ఇంతవరకు అసలు లేదు, కొసరు లేదంటున్నారు వరంగల్ జిల్లా రైతులు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీలను నిలబెట్టుకోలేకపోయింది. ఒక్కో రైతు పెట్టుబడులు కోసం 50 వేలు, లక్ష రూపాయల వరకు బ్యాంకు రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు వాటిని చెల్లించాలంటే రైతులకు ఉన్న భూములు తెగనమ్మినా కూడా కట్టడానికి సరిపోవు అంటున్నారు.

పెట్టుబడి సాయం కింద రైతులు తీసుకున్న రుణాలను వెంటనే మాఫీ చేయాలి. వానాకాలం పెట్టుబడుల కోసం బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. యాసంగి ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు జమ కాలేదు. మరోవైపు రైతుబంధు కూడా అందలేదు. రైతులకు వెంటనే కొత్త పంట రుణాలు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. పాత రుణాలను కూడా వెంటనే మాఫీ చేయాంటున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలి. వానాకాలం సాగు పెట్టుబడులకు కొత్త రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories