దివ్య హత్య కేసులో కీలక పరిణామం

దివ్య హత్య కేసులో కీలక పరిణామం
x
దివ్య హత్య కేసులో కీలక పరిణామం
Highlights

బ్యాంక్ ఉద్యోగి దివ్య హత్య కేసులో నిందితుడు వెంకటేష్ ను సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వేములవాడ పోలీసులు...

బ్యాంక్ ఉద్యోగి దివ్య హత్య కేసులో నిందితుడు వెంకటేష్ ను సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వేములవాడ పోలీసులు నిందితుడిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. సిద్ధిపేట పోలీసులకు వెంకటేష్ ను అప్పగించనున్నారు. నిన్న హత్య జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్, వేములవాడ పీఎస్ లో లొంగిపోయాడు.

దివ్య కేసులో ఆమె కుటుంబ సభ్యులతో న్యాయం చేస్తామని సిద్దిపేట ఇంచార్జ్ సీపీ శ్వేతా రెడ్డి తెలిపారు. నిందితుడిని శిక్షించే వరకు మృతదేహాన్ని తరలించమని దివ్య కుటంబసభ్యులు ఆందోళకు దిగడంతో సీపీ వారితో మాట్లాడి, నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని శ్వేతారెడ్డి తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories