పీవీపీ నుంచి నన్ను కాపాడండి : బండ్ల గణేష్

పీవీపీ నుంచి నన్ను కాపాడండి : బండ్ల గణేష్
x
Highlights

పీవీపీ నుంచి తనను కాపాడాలని సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఏపీ సీఎం జగన్‎ను కోరారు. ఈ మేరకు తన ట్వీట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పెట్టారు.

వైసీపీ నేత పీవీపీ నుంచి తనను కాపాడాలని సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఏపీ సీఎం జగన్‎ను కోరారు. ఈ మేరకు తన ట్వీట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పెట్టారు. రాజన్న రాజ్యం వచ్చిందని అనందంతో బతుకుతున్న ప్రజలకు ఇలాంటి దుర్మార్గుడి చేతి నుంచి కాపాడండి సార్ అని ట్వీట్ చేశారు. ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలి బెరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.


వైసీపీ నేత పీవీపీ బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గణేశ్‌కు చెందిన మనుషులు పీవీపీ ఇంటికి వెళ్లి అతన్ని బెదిరించారారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీవీపీ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై సెక్షన్లు 448, 506 కింద పోలీసులు బండ్ల గణేష్ పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.














Show Full Article
Print Article
Next Story
More Stories