సంచలన నిర్ణయం తీసుకున్న బండ్ల గణేష్

సంచలన నిర్ణయం తీసుకున్న బండ్ల గణేష్
x
Highlights

సినీ నటుడు, నిర్మాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్‌ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో...

సినీ నటుడు, నిర్మాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్‌ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీలో చేరిన ఆయన.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగతకారణాల రీత్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని బండ్ల గణేష్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్‌ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తాను చేసిన విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టినవారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నా అని వేడుకున్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఐఏసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత‍్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదని.. కేవలం సినీప్రముఖుడిని మాత్రమే అని బండ్ల గణేష్‌ చెప్పారు. కాగా గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే తాను పీక కోసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories