Bandi Sanjay: ఎంఐఎం గోడమీది పిల్లిలాంటిది.. దమ్ముంటే అక్బరుద్దీన్‌ కొడంగల్‌ నుంచి పోటీ చేయాలి

Bandi Sanjay Sensational Comments on MIM Party
x

Bandi Sanjay: ఎంఐఎం గోడమీది పిల్లిలాంటిది.. దమ్ముంటే అక్బరుద్దీన్‌ కొడంగల్‌ నుంచి పోటీ చేయాలి

Highlights

Bandi Sanjay: పాతబస్తి లాల్‌దర్వాజ బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రి బండి సంజయ్‌ చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Bandi Sanjay: పాతబస్తి లాల్‌దర్వాజ బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రి బండి సంజయ్‌ చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎంఐఎం గోడమీది పిల్లిలాంటిదని, ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుందని మంత్రి విమర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డికు దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై అక్బరుద్దీన్‌ కొడంగల్‌ నుంచి పోటీ చేయించాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్‌ టెంపుల్‌గా మారుస్తామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు.

ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలని హితవు పలికారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్‌ టెంపుల్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. తాను హిందువుల తరపున పక్కా మాట్లాడుతానని... అంతే తప్పా ఇతర మతాలకు వ్యతిరేకం కాదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories