Bandi Sanjay: ఇవాళ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు

Bandi Sanjay Praja Sangrama Yatra Ends Today
x

Bandi Sanjay: ఇవాళ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు

Highlights

Bandi Sanjay: సభకు హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ ఇవాళ ముగించబోతున్నారు. భైంసానుంచి కరీంనగర్ దాకా సాగిన యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా హాజరవుతున్న నేపథ్యం భారీ జనసమీకరణకు పార్టీశ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. కరీంనగర్ వేదికగా నిర్వహించే ప్రజాసంగ్రామసభను బండి సంజయ్ సమరశంఖారావాన్ని పూరించబోతున్నారు.

కరీంనగర్ SRR కళాశాల మైదానంలో సభాఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసభకు జేపీ నడ్డాతోపాటు బీజేపీ ఇంచార్జ్ లు తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ లాంటి ముఖ్యనేతలు సభకు హాజరుకానున్నారు‌. తెలంగాణ జిల్లాలనుంచి బీజేపీ క్యాడర్ ను తరలించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని పోలింగ్ బూత్ కమిటీలకు చెందిన‌ బీజేపీ సభ్యులంతా హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించడంతోపాటు .. రవాణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన‌ ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చేందుకు ప్లాన్ చేశారు. బహిరంగసభను సక్సెస్ చేయడం ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేననే సంకేతాలను పంపాలని కమలం పార్టీ భావిస్తోంది

ఇంకోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో కరీంనగర్ సభ నుంచే ఏన్నికల‌ ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కమలం పార్టీ నిర్ణయించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం బీజేపీ శ్రేణులకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దిశానిర్దేశం చేయనున్నారు. భారీ సమీకరణ చేయటం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే సందేశాన్నివాలని బీజేపీ పట్టుదలతో ఉంది‌. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి కేసీఆర్ గ్రాఫ్ అమాంతంగా పెరగడానికి బీజం పడింది కరీంనగరే. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భవిష్యత్తుకు బాట వేసిన కరీంనగర్ లోనే సభను సక్సెస్ చేయడం ద్వారా టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది.

మొదటి నాలుగు విడతల్లో బండి సంజయ్ పాదయాత్రతో 13పార్లమెంట్, 48అసెంబ్లీ నియోజకవర్గాలు, 21జిల్లాల మీదుగా సాగింది. మెదటి నాలుగు విడత పాదయాత్ర ద్వారా 1178కిలోమీటర్లు నడిచారు‌. నవంబర్ 28న బైంసా నుండి ప్రారంభమైన ఐదీ విడత ప్రజా సంగ్రామయాత్ర నిర్మల్, ఖానాపూర్, కోరుట్ల, జగిత్యాల, కొండగట్టు, గంగాధర మీదుగా సాగి కరీంనగర్ ఎస్సారార్ కళాశాలవద్ద ముగియనుంది. 8అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 222 కిలోమీటర్లు ఐదో విడతలో నడిచారు. దీంతో మొత్తం ఐదు విడతల్లో బండి సంజయ్ 56అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1400కిలోమీటర్లులు పాదయాత్ర పూర్తిచేసుకున్నారు. కరీంనగర్‌లో జరిగే బహిరంగసభలోనే ఆరో విడత ప్రజా సంగ్రామయాత్ర షెడ్యూల్ ను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గతేడాది ఆగస్ట్ 28న చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైన పాదయాత్ర నుంచి ఇప్పటివరకు మొత్తం 14 భారీ బహిరంగ సభలు, వందకుపైగా మినీ సభలతోపాటు పెద్ద ఎత్తున రచ్చబండలు, స్థానిక నేతలతో ఇంట్రాక్షన్ వంటి కార్యక్రమాలను బండి సంజయ్ నిర్వహించారు. అయితే కరీంనగర్ సభ ముగిసిన వెంటనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై బండి సంజయ్ ఫోకస్ పెట్టనున్నారని సమాచారం. ఇందులో భాగంగా పది రోజుల పాటు హైదరాబాద్ సిటీలో పాదయాత్ర నిర్వహించేందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories