నేటితో సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు

Bandi Sanjay Praja Sangrama Yatra Ends Today
x

నేటితో సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు

Highlights

*తుక్కుగూడలో భారీ సభ.. ముఖ్య అతిథిగా అమిత్‌ షా

Telangana: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. చలో తక్కుగూడ సభకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కు వచ్చే ఎన్నికల లక్ష్యానికి ఈ సభ కీలకమని కమలదళం భావిస్తోంది. అందుకే సభ ఏర్పాట్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని భారీ జన సమీకరణకు పూనుకున్నారు. తుక్కుగూడ ORR ఎగ్జిట్ -14 సమీపంలో జరిగే సభకు ప్రధాన వేదిక సహా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

సభా ప్రాంగణం సమీపంలో ఆరు చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. వేదికపై 150 మంది నేతలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. అమిత్ షా సభా ప్రాంగాణానికి శనివారం సాయంత్రం దాదాపు 6.30 గంటల సమయంలో చేరుకుంటారు. అయితే బహిరంగ ముందు శంషాబాద్ నోవాటెల్ జరిగే కోర్ కమిటీ సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల్ని తెలుసుకోవడంతోపాటు వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి సారించింది. పార్టీ బలోపేతానికి అగ్రనేత అమిత్ షా వీలైనన్ని సార్లు రాష్ట్రానికి వస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సైతం ప్రచారం చేసి వెళ్లారు. ఆ తర్వాత బండి సంజయ్ తొలి విడత ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో నిర్మల్‌ సభకు వచ్చారాయన. 8నెలల వ్యవధిలోనే రాష్ట్ర పర్యటనకు రెండోసారి వస్తున్నారు అమిత్ షా.

Show Full Article
Print Article
Next Story
More Stories