బెలూన్ మ్యాన్..చెవితో బెలూన్లు..

బెలూన్ మ్యాన్..చెవితో బెలూన్లు..
x
Highlights

బెలూన్లు సాధారణంగా కొందరు నోటితో ఊదుతారు లేదంటే పంపుతో గాలి నింపుతారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు వినూత్నంగా చెవితో బెలూన్లు ఊదేస్తూ జాతీయ...

బెలూన్లు సాధారణంగా కొందరు నోటితో ఊదుతారు లేదంటే పంపుతో గాలి నింపుతారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు వినూత్నంగా చెవితో బెలూన్లు ఊదేస్తూ జాతీయ స్థాయిలో రికార్డులు సొంతం చేసుకున్నాడు. అదేంటి చెవితో బెలూన్లూ ఉదటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా ఇది నిజం.

ఈ యువకుడి పేరు ఫకీర్ పాషా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన పాషా పదో తరగతి వరకు చదివాడు పదిహేనేళ్లుగా చెవితో బెలూన్లు ఊదుతూ అందర్ని అబ్బురపరుస్తూ బెలూన్ పాషాగా గుర్తింపు పొందాడు. పాషా టాలెంట్ చూసి అనేక జాతీయ ఛానళ్లు టాలెంట్ షోకు ఆహ్వానించాయి. ప్రతి షోలోనూ తన టాలెంట్ ప్రదర్శిస్తూ వస్తున్నాడు. 70 సెంటి మీటర్ల పొడవైన బెలూన్ ను మూడు నిమిషాల్లో చెవితో ఊదటం చూపరులను అబ్బుర పరుస్తుంది.

ఓ రోజు చెరువులో ఈతకు వెళ్లిన సమయంలో పాషా చెవుల్లోకి నీళ్లు పోయాయి. ముక్కును గట్టిగా పట్టుకుని గాలి పీల్చడంతో చెవిలోని నీరు బయటకు వెళ్లిపోయింది. దీంతో చెవులతో గాలిని బయటకు పంపడం సాధనం చేసి అదే తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు. రియాల్టీ షోల్లోనూ అనేక ప్రదర్శనలు ఇచ్చిన పాషాకు 2017లో పంజాబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో యూనిక్ వరల్డ్ రికార్డు లిమిటెడ్ చోటు దక్కింది. మూడు నిమిషాల్లో 70 సెంటిమీటర్ల పొడవు బెలూన్ ఊదినందుకు యూనిక్యూ ప్రపంచ రికార్డులో స్థానం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం పాషాను ఉత్తమ కళాకారునిగా గుర్తించి అవార్డు అంద చేసింది.

పాషా అంతర్జాతీయ స్థాయి షోలో పాల్గొనేందుకు ఆహ్వానం అందుతున్నా పాల్గొనేందుకు పేదరికం అడ్డంకిగా నిలుస్తుందని అతని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహిస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించగలడని చెబుతున్నారు. మట్టిలో పుట్టి మాణిక్యంలా ఎదిగిన గిన్నిస్ బుక్ లో స్థానం కోసం ప్రయత్నిస్తున్న ఫకీర్ పాషా ఆశయం నెరవేరాలని.. ఇందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కల్పించాలని అంతా కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories