Balka Suman: జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ విడుదల

Balka Suman: క్యాతన్ పల్లి రాళ్లదాడి ఘటనలో ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్ ఎట్టకేలకు జైలు నుండి విడుదలయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 March 2026 11:07 AM IST
Balka Suman: జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ విడుదల
X

Balka Suman: జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ విడుదల

Balka Suman: క్యాతన్ పల్లి రాళ్లదాడి ఘటనలో ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్ ఎట్టకేలకు జైలు నుండి విడుదలయ్యారు. క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న రాళ్లదాడి ఘటనలో బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఫిబ్రవరి 18వ తేదీన ఆయన్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. పోలీసులు పలు పిటి వారింట్లు, కస్టడీ పిటిషన్లు వేసినప్పటికీ మంచిర్యాల జిల్లా జూనియర్ సివిల్ జడ్జి వాటిని సున్నితంగా తోసిపుచ్చారు.

రాళ్లదాడి ఘటనలో బెయిల్ మంజూరు అయినప్పటికీ చెన్నూర్ లో నమోదైన ధర్నా కేసుపై మంగళవారం న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగాయి. ఈ కేసులోనూ బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు కావడంతో ఇవాళ ఉదయం అయన జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ మంత్రి జోగు రామన్న సహా బీఆర్ఎస్ కీలక నేతలు సుమన్‌కు జైలు వద్ద ఘన స్వాగతం పలికారు. సుమన్‌తో పాటు మూల రాజిరెడ్డి సైతం బెయిల్‌పై బయటకు వచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story