వాహనాల డీలర్లకు అవగాహన సదస్సు

వాహనాల డీలర్లకు అవగాహన సదస్సు
x
రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్, డి టి ఓ ఎర్రి స్వామి
Highlights

రవాణా శాఖ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశం అనుసారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 23, 24 లపై వాహనాల డీలర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

నాగర్ కర్నూల్: రవాణా శాఖ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశం అనుసారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 23, 24 లపై వాహనాల డీలర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షో రూంల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో పత్రాలను అందజేశారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా ఇచ్చిన సర్క్యులలోని అంశాలను కూడా రవాణా శాఖ అధికారి ఎర్రి స్వామి వారికి వివరించారు. పైన పేర్కొన్న జీవోలలోని సంబంధిత మార్గ నిర్దేశ కాలా మేరకు14/10/2019 నుంచి కొనుగోలు చేసిన వాహనాలకు హెచ్ ఎస్ ఆర్ పి నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని డెలివరీ ఇవ్వకూడదని చెప్పారు.

నిబంధనలు అతిక్రమిస్తే రెండు లక్షల నుండి 5 లక్షల వరకు షోరూమ్ యజమానులకు జరిమానా విధిస్తామని అన్నారు. కొనుగోలుదారు దరఖాస్తు తేదీ నుంచి నాలుగు రోజుల్లో కొత్త వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ బిగించే కార్యక్రమం పూర్తి కావాలని సూచించారు. కొనుగోలుదారు వద్ద ఎట్టి పరిస్థితుల్లో వాహన ధర మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసారు. ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ కోసం డబ్బులు తీసుకోరాదని, ఎవరి వద్దన్న తీసుకున్నట్టు రుజువైతే భారీగా జరిమానాలు, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని డి టి ఓ ఎర్రి స్వామి వివరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories