తల్లిపై బీరు సీసాతో దాడి....

తల్లిపై బీరు సీసాతో దాడి....
x
Highlights

తల్లిపై విచక్షణారహితంగా బీరు సీసాతో దాడి చేసిన ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో చోటుచేసుంది.

కొడుకులు తల్లిదండ్రుల్నీ పున్నామ నరకం నుంచి తప్పిస్తాడంటారు కానీ కన్న తల్లిపై విచక్షణారహితంగా బీరు సీసాతో దాడి చేసిన ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో చోటుచేసుంది. కిట్టమ్మ కుమారుడు సూరిబాబు పార్వతీపురం నివాసముంటున్నారు. అయితే గత కొద్దీ రోజులుగా తల్లీ కొడుకుల మధ్య ఆస్తి వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. వ్యసనాలకు అలవాటు పడిన కొడుకు సూరిబాబు కిట్టమ్మను డబ్బులు ఇవ్వమని లేదంటే చంపేస్తానని బెదిరించసాగాడు. ఈ నేపథ్యంలో కిట్టమ్మపై కుమారుడు సరిబాబు బీరు సీసాతో దాడి చేసి పరారైయ్యాడు. కిట్టమ్మ గొంతుకి గాయమవ్వడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories