వెయ్యి కొడితే పదివేలు.. ఏటీఎంలో ఎక్కువ డబ్బులు వస్తుండటంతో ఎగబడిన జనం

వెయ్యి కొడితే పదివేలు.. ఏటీఎంలో ఎక్కువ డబ్బులు వస్తుండటంతో ఎగబడిన జనం
x
ఏటీఎంలో ఎక్కువ డబ్బులు వస్తుండటంతో ఎగబడిన జనం
Highlights

వెయ్యి రూపాయలు తియ్యాలనుకుంటే ఆ ATM మిషన్ పది వేల రూపాయలు ఇస్తుంది. అదే పనిగా పదిసార్లు వెయ్యి రూపాయల చోప్పున తీసుంకుంటే ఇగ మీ పంట పండినట్టే. ఇలా...

వెయ్యి రూపాయలు తియ్యాలనుకుంటే ఆ ATM మిషన్ పది వేల రూపాయలు ఇస్తుంది. అదే పనిగా పదిసార్లు వెయ్యి రూపాయల చోప్పున తీసుంకుంటే ఇగ మీ పంట పండినట్టే. ఇలా కొట్టిన దాని కంటే ఎక్కువ పైసలు వస్తే జనాలు ఊరుకుంటారా? ఆ మిషన్ కాడికి నిలబడి లైన్లు కట్టరా?.

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ లో ఈ ఘటన జరిగింది. కమలాపూర్ బస్టాండ్ దగ్గర ఈ మధ్యన కొత్తగా పెట్టిన ఇండియన్ వన్ ఎటిఎం మిషన్ లో నుంచి పైసలు తీసుకునేందుకు పోయిన వారికి పండగే పండగ. వెయ్యి రూపాయలుతీయాలనుకున్న వాళ్లకు ఆరు వేల నుంచి పదివేల వరకు వచ్చాయి. ఈ ముచ్చట ఆ నోటా ఈ నోటా పడడంతో ఖాళీ అయ్యేదాకా లైన్ లో ఎగబడి మరి ప్రజలు డబ్బులు తీసుకున్నారు.

ఈ ముచ్చట పోలీసులకు తెలిసి అక్కడికి వచ్చేసరికి డబ్బులు తీసుకున్నవారు అక్కడ ఎవరు లేకుండా పోయారు. ఆ ATM మిషిన్ చూసి అధికారులు రిపేరు చేసేవాళ్ళు అక్కడికి వచ్చి మిషన్ విప్పి డబ్బులు చూసుకున్నారు. 500 నోట్లు 200 నోట్లు మొత్తమే ఖాళీ అయ్యాయి. 100 నోట్లు కొన్ని మిగిలిపోయాయి. మిషన్ లో ఎనిమిది లక్షల పైగానే ఉండేనట. సాంకేతికంగా సమస్య రావడం తోనే ఇలా జరిగిందని ఏటీఎం అధికారులు అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories