బండి సంజ‌య్‌కు మంత్రి హ‌రీష్ స‌వాల్

బండి సంజ‌య్‌కు మంత్రి హ‌రీష్ స‌వాల్
x
Highlights

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. దుబ్బాక ఎన్నికల్లో హమీ తుమీ తేల్చుకునేందుకు అన్ని పార్టీల కార్యకర్తలు ప్రచారాన్ని...

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. దుబ్బాక ఎన్నికల్లో హమీ తుమీ తేల్చుకునేందుకు అన్ని పార్టీల కార్యకర్తలు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే దుబ్బాక మహిళలు టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సంఘీబావ ర్యాలీ నిర్వహించారు. మంగళ హరతులు, డప్పు చప్పుళ్లతో దుబ్బాక బస్ డిపో నుంచి అంబేద్క‌ర్ సర్కిల్ మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగించారు. ఈ సంద‌ర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బీడి పెన్ష‌న‌ర్ల‌కు 1600 రూపాయ‌లు ఇస్తున్నామ‌ని బీజేపీ చేపుతుందంతా ప‌చ్చి అబద్ద‌మ‌ని అన్నారు. చింతమడకల పుట్టిదుబ్బాకలో చదువుకున్న కేసీఆర్‌కు దుబ్బాక పైన ప్రేమ ఉంటది కానీ.. పరాయి నాయకులకు ప్రేమ ఉంటాదా అని ప్ర‌శ్నించారు.

బీడీ కార్మికులకు 1600 పెన్షన్ ఇస్తున్నట్లు సాక్ష్యాలు, ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హ‌రీష్ రావు అన్నారు. ఒక‌వేళ ఇవ్వకపోతే నువ్వు రాజీనామాకు సిద్దామా అంటూ బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. రాష్ర్ట ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు కేంద్ర‌మే నిధులు ఇస్తోంద‌ని బీజేపీ దుష్ప్రచారం చేస్తోంద‌ని మంత్రి హ‌రీష్ అన్నారు. సోలీపేట సుజాతక్క గెలుపు మ‌హిళ‌ల గెలుపన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతులకు ఉచిత కరెంట్, బీడీ పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణలక్ష్మీ స్కీము ఇస్తోందా అని ప్ర‌శ్నించారు. మోదీ సొంత రాష్ట్రంలో 500 రూపాయ‌ల పెన్షన్ ఇస్తే కేసీఆర్ 2000 రూపాయ‌లు ఇస్తున్నార‌ని, బీజేపీ, కాంగ్రెస్ చేసే అస‌త్య ప్ర‌చారాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని తెలిపారు. దుబ్బాక ప్ర‌జ‌లు అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని కాంగ్రెస్, బీజేపీల‌ను న‌మ్మితే మోస‌పోతామ‌ని తెలిపారు. 'బీజేపీ ఏమి చేస్తామని ప్రచారం చేస్తారు ? విద్యుత్ మీటర్లు పెడతామని ఓట్లు అడుగుతారా ? విదేశీ మక్కలు తెచ్చి రైతుల పొట్టలు కొడతామని అడుగుతారా ? ఎవరి ప్రయోజనాల కోసం విదేశీ మక్కలు తెస్తున్నారో బీజేపీ చెప్పాలి' అని మంత్రి హ‌రీష్ డిమాండ్ చేశారు.

అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత మాట్లాడుతూ రామలింగారెడ్డి తన చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే గడిపారని అన్నారు. దుబ్బాక ప్రజల ఆశీస్సులతో రామలింగారెడ్డి అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలను కొనసాగిస్తాను అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తండ్రి లాగా నన్ను ఆశీర్వదించి మీ సేవ కోసం పంపారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, స‌హా ప‌లువురు టిఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories