నా ఇంటికొస్తే పాస్‌మార్కులు పక్కా..బాసర ట్రిపుల్ ఐటీలో లైంగిక వేధింపులు

నా ఇంటికొస్తే పాస్‌మార్కులు పక్కా..బాసర ట్రిపుల్ ఐటీలో లైంగిక వేధింపులు
x
Highlights

విద్యార్థులకు విద్యాబోదన చెప్పి సరైన బుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు కీచకుడి అవతారమెత్తాడు. చదువుల తల్లి సరస్వతి దేవి కొలువైన నిర్మల్ జిల్లాలోని...

విద్యార్థులకు విద్యాబోదన చెప్పి సరైన బుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు కీచకుడి అవతారమెత్తాడు. చదువుల తల్లి సరస్వతి దేవి కొలువైన నిర్మల్ జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థినుల జీవితాలను ఆగం చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థినులే టార్గెట్‌గా వారిని ఇబ్బందులు పెట్టాడు. అయితే మొత్తానికి ఆ కిచకుడి పాపం పండింది. ఇక వివరాల్లోకి వెళితే బాసర ట్రిపుల్‌ ఐటీలో కెమిస్ట్రీ విభాగాధిపతిగా పనిచేస్తోన్న ఆ ప్రొఫెసర్‌ పేరు రవి వరాల. ఫెయిల్‌ అయిన విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని వెధింపులకు గురిచేస్తుంటాడు.

పీయూసీ-2 సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు క్యాంపస్ కు వచ్చిన ఓ విద్యార్థిని శనివారం ఇంటికి తిరిగి వెళ్లేందుకు వర్సిటీ నుంచి పయనమైంది. అయితే వర్సిటీ నిబంధనల ప్రకారం ఔట్‌పాస్‌ ఇచ్చే సమయంలో సదరు విద్యార్థినులు వారి పేరెంట్స్‌తో మాట్లాడాలి. కాగా శనివారం కూడా మీ ఫాదర్‌తో ఫోన్‌లో మాట్లాడించాలని విద్యార్థినికి సూచించింది వార్డెన్‌. అదే సమయంలో ప్రొఫెసర్ రవి వరాల మొబైల్ నంబరు నుంచి సదరు విద్యార్థినికి మెసేజ్‌లు వచ్చినట్టు గుర్తించారు. నిజామాబాద్‌లో ఉన్న మా ఇంటికి రా ఇదే అడ్రస్‌ నిన్ను పాస్‌ చేయిస్తా అనేది ఆ మెసేజ్ సారాంశం. ఓ విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి వాట్సాప్ లో అభ్యంతరకరమైన మెసెజ్ పెట్టి వేధించాడు. ఈ మెసెజ్ గురించి వార్డెన్ కు బాధిత విద్యార్థిని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లితే, విషయం బయట చెప్పవద్దని బెదిరించాడు. ఇదే తరహాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి మరింత మంది విద్యార్థినులకు వేధించినట్లు ఆరోపణలు రావడంతో ట్రిఫుల్ ఐటీ అధికారులు విచారణ జరుపుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ కీచక అధ్యాపకుడిపై వేటు పడింది. విద్యార్థినులను అసభ్యకర మెసేజ్ లతో వేధిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రవిను విధుల నుంచి అధికారులు తొలగించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి వ్యవహారంపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories