Bhukya Hariram: ఆదాయానికి మించిన ఆస్తులు.. కాళేశ్వరం ఎండీ భూక్యా హరిరామ్ అరెస్ట్

Bhukya Hariram: ఆదాయానికి మించిన ఆస్తులు.. కాళేశ్వరం ఎండీ భూక్యా హరిరామ్ అరెస్ట్
x
Highlights

Bhukya Hariram: కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ భూక్యా హరిరామ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో భూక్యా హరిరామ్...

Bhukya Hariram: కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ భూక్యా హరిరామ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో భూక్యా హరిరామ్ అరెస్ట్ అయ్యారు. శనివారం హైదరాబాద్ లోని 14 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో హరిరామ్ కు భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆయనతోపాటు బంధువుల పేరుతో విల్లాలు, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగి ప్రాంతాల్లో ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఏపీలోని అమరావతిలో కమర్షియల్ భూములు, మార్కుక్ మండలంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. శ్రీనగర్ కాలనీలో ఇళ్లు, బొమ్మలరామారంలో మామిడితోటలతో పాటు ఫామ్ హౌస్ ఉన్నట్లు విచారణలో తేలింది. అంతేకాదు ఈ తనిఖీల్లో విలువైన రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories