Top
logo

తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం

తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం
Highlights

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలకు చెందిన బిల్లులను సభ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా మున్సిపల్ సవరణ బిల్లు-2019ని, తెలంగాణ సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లును సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలకు చెందిన బిల్లులను సభ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా మున్సిపల్ సవరణ బిల్లు-2019ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ బిల్లును ఐటీ,మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..పౌరులే పాలకులు కావాలనే ఉద్దేశ్యంతోనే మున్సిపల్ సవరణ బిల్లు తెస్తున్నామని కేటీఆర్‌ అన్నారు. పౌరులను పాలనలో భాగస్వాములను చేయబోతున్నామని తెలిపారు. మున్సిపల్ సవరణ బిల్లును సభ్యులంతా ఏక గ్రీవంగా ఆమోదం తెలిపారు.

అలాగే తెలంగాణ సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. కేసుల సత్వర పరిష్కారం, కోర్టుల విధుల నిర్వహణలో సమతుల్యత లభిస్తుందని చెప్పారు. తెలంగాణ సివిల్ కోర్టుల చట్ట సవరణతో ప్రజలకు, న్యాయవాదులకు సౌలభ్యంగా ఉంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అనంతరం సభ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.


లైవ్ టీవి


Share it
Top