TS Elections: సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల నామినేషన్లకు ‘ముఖరా’ ఆసరా పింఛన్‌లు

Asara Pension Beneficiaries For Cm Kcr Nomination
x

TS Elections: సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల నామినేషన్లకు ‘ముఖరా’ ఆసరా పింఛన్‌లు

Highlights

TS Elections: తలో వెయ్యి రూపాయలతో లక్ష జమ చేసిన పెన్షన్‌దారులు

TS Elections: గ్రామ పెన్షన్‌దారులు కేసీఆర్, కేటీఆర్ నామినేషన్ ఖర్చుల కోసం ఆసరాగా నిలిచారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరాకే గ్రామానికి చెందిన ఆసరా పెన్షన్‌దారులు సర్పంచ్‌ మీనాక్షికి తలా వెయ్యి రూపాయల చొప్పున లక్ష నగదును అందించారు. తమ జీవితాలకు ఆర్థిక భరోసాను అందించిన కేసీఆర్‌కు అందించాలని నిర్ణయించారు. ఎంపీ బోయినపల్లి సంతోష్ సహకారంతో సర్పంచ్‌ మీనాక్షి సీఎం కేసీఆర్‌ను కలిసి లక్ష రూపాయల చెక్‌ను అందించారు. కేసీఆర్, కేటీఆర్ నామినేషన్ ఖర్చుల కోసం చెరో 50వేలు అందించారు. ముఖరాకే గ్రామస్తులకు సీఎం కేసీఆర్, కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories