చిరంజీవి క్వారంటైన్ లో ఉండాల్సిందే : వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు

చిరంజీవి క్వారంటైన్ లో ఉండాల్సిందే : వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు
x

chiranjeevi (file image)

Highlights

మెగాస్టార్ చిరజీవి తొలుత తనకు కరోనా పాజిటివ్ వచ్చింది అని చెప్పి.. రెండురోజుల తరువాత అది టెస్ట్ లలో సమస్య వలన వచ్చిన పాజిటివ్ రిపోర్ట్ అనీ, మళ్ళీ...

మెగాస్టార్ చిరజీవి తొలుత తనకు కరోనా పాజిటివ్ వచ్చింది అని చెప్పి.. రెండురోజుల తరువాత అది టెస్ట్ లలో సమస్య వలన వచ్చిన పాజిటివ్ రిపోర్ట్ అనీ, మళ్ళీ చేసిన టెస్ట్ లలో నెగెటివ్ వచ్చిందనీ చెప్పిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆయన స్వయంగా ట్వీట్ లు చేశారు. అయితే, ఒకసారి పాజిటివ్ అని వచ్చి.. మళ్ళీ నెగెటివ్ అని వచ్చినా సరే తప్పనిసరిగా క్వారంటైన్ లో చిరంజీవి ఉండాల్సిందే అనీ.. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం అది తప్పనిసరి అని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.

ఒకసారి కరోనా పాజిటివ్‌‌‌గా తేలి, ఆపై నెగటివ్ వచ్చినా, ఐసీఎంఆర్ ..ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనల ప్రకారం, క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతున్న సమయంలో, నటుడు చిరంజీవికి తొలుత పాజిటివ్ వచ్చి, ఆపై అది నెగటివ్ గా తేలిన విషయం ప్రస్తావనకు వచ్చింది.

దీనిపై స్పందించిన శ్రీనివాసరావు, ఏ కరోనా పరీక్ష కూడా నూటికి నూరు శాతం కచ్చితత్వంతో రాదని స్పష్టం చేశారు. ఒకసారి పరీక్షలో పాజిటివ్ వస్తే, పాజిటివ్ గానే భావించాల్సి వుంటుందని ఆయన అన్నారు. ఆ తరువాత నెగటివ్ వచ్చినా, లక్షణాలు ఉన్నా, లేకున్నా, క్వారంటైన్‌లో ఉండి స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

కాగా, తొలుత తనకు కరోనా సోకిందని, లక్షణాలు లేవని గత వారంలో ప్రకటించిన చిరంజీవి, ఆపై తప్పుడు ఫలితం వచ్చిందని, తనకు కరోనా సోకలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఐసీఎంఆర్ ప్రొటోకాల్ ప్రకారం, ఫలితం తప్పుగా వచ్చిందని తేలినా, క్వారంటైన్ లో ఉండాల్సిందే.కరోనా టీకాపైనా స్పందించిన ఆయన, కేంద్రం నుంచి అందుతున్న సంకేతాల మేరకు జనవరి లేదా ఫిబ్రవరిలో హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు.ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ ఉద్యోగుల సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, ప్రజలు భౌతికదూరం పాటిస్తూ, మాస్క్ ధరిస్తేనే కరోనాకు దూరంగా ఉండవచ్చని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories